- భూ సమస్యలు ఉన్నాయని రెవెన్యూ అధికారి వద్దకు వెళితే.. రాజకీయనాయకుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్న అధికారి!
- అధికార మదంతో.. బాధ్యతలను మర్చిపోతున్న వైనం
- పేరుకు పెద్దపదవి.. చేసేవి చిల్లర పనులు!
- జిల్లాలోని ఓ మండల రెవెన్యూ అధికారి తంతంగాలు..
- త్వరలోనే అన్ని ఆధారాలు బట్టబయలు చేస్తామంటున్న బాధితులు!

అధికార అహంకారం తలకెక్కితే… ఉన్న మతి పోతుందట! సరిగ్గా ఇదే తంతు హన్మకొండ జిల్లాలోని ఓ మండలం రెవెన్యూ కార్యాలయంలో జరుగుతోంది.
మండల ఆఫీస్ కు రావడమే లేటు.. పైగా సామాన్యులు వివరాలు అడిగితే విసుగు. అలాంటప్పుడు ఆ సీట్లో కూర్చోవడం ఎందుకు?
పేరుకు పెద్ద సీట్లో కూర్చున్నా.. చేసే పనులన్నీ చిల్లర పనులే!
ఈ విషయాన్ని మండలంలోని సామాన్యు ప్రజలను ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఇందులో విచిత్రం ఏంటంటే.. బాధితులు చెబుతున్న ప్రకారం.. ఆ సీట్లో కూర్చునే అర్హత ఆ అధికారికి లేదు అని.! ఎందుకంటే.. భూ సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారి వద్దకు వెళితే.. ఆ అధికారి ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే… లోకల్ గా ఉన్న రాజకీయ నాయకుడి వద్దకు వెళ్లి సమస్యను పరిష్కరించుకోవాలి అని చెబుతున్నారట.!
అలాంటప్పుడు రెవెన్యూ వ్యవస్థ ఎందుకు ? తాను కూర్చున్న ఆ కుర్చీకి విలువేంటి? తన అర్హతకు ఉన్న విలువేంటి? అని కొంతమంది లోకల్ గా ఉన్నవారు, సమస్యలు ఎదుర్కుంటున్న బాధితులు సూటిగా వేస్తున్న ప్రశ్నే ఇది!
భూ సమస్యలు ఉన్నాయని సంబంధిత అధికారివద్దకు వెళితే..
“దమ్ముంటే రాజకీయ నాయకులతో చెప్పుకొని సమస్యను పరిష్కరించుకోవాలి” అని చెబుతున్నారని, .. దీన్నిబట్టి తనకి ఆ అధికార సీటు కూడా ఎవరో ఒక రాజకీయ అండతోనే అంది ఉండవచ్చు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఎందుకంటే.. నిజాయతీగా తెచ్చుకునే పదవుల్లో కూర్చునేవారు.. దొంగదారిలో అధికారాన్ని సంపాదించుకునేవారి తతంగాలు, వారి మాటల్లోనే అర్ధమవుతాయి అనేది బాధితుల అంచనా.
మారుమూల మండలం, పైగా ప్రశ్నించే వారులేరనే అధికార అహంకారంతోనే .. ఇష్టమొచ్చినట్లు అక్కడి అధికారి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా… పట్టించుకోవడంలేదని, పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని, సందర్భాన్ని బట్టి ఆ అధికారి చేస్తున్న బాగోతాలన్నీ ఎప్పుడో ఒకసారి బట్టబయలు అవుతాయని పలువురు ఖరాఖండిగా చెబుతున్నారంటే.. ఆ అధికారి పనితనం ఏంటో అక్కడే అర్ధమవుతోంది.
మండల కార్యాలయంలో సమస్యను పరిష్కరించడంలేదని, బాధితులు, పై అధికారులకు ఫిర్యాదు చేస్తే.. పై అధికారులు ఇచ్చిన ఆదేశాలను కూడా పట్టించుకోకుండా.. ఇష్టానుసారంగా మండల కార్యాలయ అధికారి వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అంతేకాకుండా భూ సమస్యల పరిష్కారం కోసం వెళితే.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లి సమస్యలను చెప్పుకోవాలని సూచించడం ఏంటని.. రెవెన్యూ చట్టాల్లో ఇలాంటి చట్టాలు ఎక్కడున్నాయో ఆ ప్రభుద్ధ అధికారికే తెలియాలని అంటున్నారు.
అంతేకాకుండా.. వీలైనంత త్వరలోనే.. ఆ ధికారి యొక్క తతంగాలకు సంబంధించిన ఆధారాలను బయటపెడుతామని అప్పుడు ఆ పదవికి తాను అర్హులా? లేక.. ఎవరో ఒక రాజకీయ అండతో వచ్చిన రికమెండేడ్ క్యాండిడేటో.. అర్ధమవుతుందని బాధితులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా నిజంగా మోసపోయిన బాధితులకు అండగా నిలబడి, సరైన దారిలో చట్టాలను ఉపయోగించి, మోసపోయిన అమాయకుల వైపు చట్టపరమైన న్యాయం చెయ్యాలని, లేని పక్షంలో.. త్వరలోనే .. వారివ్యవహారాలు బట్టబయలు చేసి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా.. పై అధికారులకు పిర్యాదు చేస్తామని బడ్గితులు హెచ్చరిస్తున్నారు.
