హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తన నూతన హైబ్రిడ్ మోడల్ విక్టోరిస్ కారును హైదరాబాద్ శేరిలింగంపల్లిలోని పవన్ మోటార్స్ షోరూమ్‌లో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు & సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
28.65 కి.మీ.పి.ఎల్ వరకు మైలేజీ ఇచ్చే ఈ హైబ్రిడ్ మోడల్ ఆధునిక భద్రతా ఫీచర్లతో పాటు భారత్ NCAP ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. పెట్రోల్ మరియు సిఎన్జి వేరియంట్లలో ఈ కారు అందుబాటులో ఉంది. పెట్రోల్ వేరియంట్ 21.18 కి.మీ.పి.ఎల్ మైలేజీ ఇస్తుండగా, హైబ్రిడ్ e-CVT మోడల్ 28.65 కి.మీ.పి.ఎల్ వరకు ఇస్తుంది.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో CBH సౌత్ ఈస్ట్ జోన్ ఆర్. సురేష్ బాబు, RM ప్రతిబన్, పవన్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి, CEO కె. రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, “దేశవ్యాప్తంగా మారుతి ఒక విశ్వసనీయమైన బ్రాండ్. మధ్య తరగతి కుటుంబాల కోసం సరసమైన బడ్జెట్లో లగ్జరీ ఫీచర్లతో కొత్త మోడల్‌ను అందించడం ఒక మంచి పరిణామం” అని అభిప్రాయపడ్డారు.

పవన్ మోటార్స్ అధినేత కోమటిరెడ్డి చంద్ర పవన్ రెడ్డి మాట్లాడుతూ, “కొత్త విక్టోరిస్ బుకింగ్స్ మా షోరూమ్‌లో ప్రారంభమయ్యాయి. కేవలం రూ.11,000 అడ్వాన్స్ చెల్లించుకుని ఈ కారును బుక్ చేసుకోవచ్చు” అని తెలిపారు.
ఈ కారులో లెవల్ 2 ADAS టెక్నాలజీ, 360 డిగ్రీ హెచ్డీ కెమెరా, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, ABS విత్ EBD వంటి ఆధునిక సౌకర్యాలు లభ్యమవుతున్నాయి. ఏడు సింగిల్ టోన్, మూడు డ్యూయల్ టోన్ కలర్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది, కస్టమర్లు కూడా పాల్గొని కొత్త మోడల్‌ను ప్రత్యక్షంగా పరిశీలించారు.

