భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది.
సినీ, రాజకీయ రంగ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్స్ వేదికగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
“దేశానికి సరైన సమయంలో లభించిన అసలు నాయకుడు మోడీ” అని ఆయన అభివర్ణించారు.

“సబ్కా సాథ్, సబ్కా వికాస్” అనే మోదీ గారి నినాదం, ఆయన తీసుకున్న సంస్కరణలు కోట్లాది భారతీయుల జీవితాల్లో విశేష మార్పులు తెచ్చాయని చంద్రబాబు అన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచస్థాయిలో తన స్థానాన్ని మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు.
2047 నాటికి ‘వికసిత్ భారత్’ దిశగా ప్రధాని చూపుతున్న మార్గం ప్రశంసనీయమని అభినందించారు.
ప్రధాని మోదీ ఆరోగ్యంగా, శక్తివంతంగా దేశానికి సేవలు అందించాలని తన ట్వీట్లో ఆకాంక్షించారు.
